EPAPER
Wednesday, November 11, 2026
Google search engine
- Advertisment -spot_img

స్వయం ఉపాధి దిశగా యువత అడుగులు వేయాలి

📰 Generate e-Paper Clip

యువతకు ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపు.. కల్కి ఫంక్షన్ హాల్ ప్రారంభం

జవహర్‌నగర్, నవంబర్ 11 (జనముద్ర): యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కల్కి ఫంక్షన్ హాల్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. యువత తల్లిదండ్రులపై ఆధారపడకుండా తమ విద్యార్హతలు, అనుభవం, ఉన్నత ఆలోచనలకు అనుగుణంగా స్వయం ఉపాధి అవకాశాలను అన్వేషించాలని సూచించారు. తాము ఉపాధి పొందడమే కాకుండా, ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపన ద్వారా యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రెడ్డిశెట్టి మహేశ్ గుప్తా, మాజీ కార్పొరేటర్ గండి రాంచందర్, పల్లపు రవి, ఆలూరి రాజశేఖర్, జిట్టా శ్రీనివాసరెడ్డి, బండకింది ప్రసాద్ గౌడ్, సుధాకరాచారి, సోమయ్య, వెంకటేశ్, ఎల్లస్వామి, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు కిరణ్, కార్తీక్, గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!