EPAPER
Wednesday, November 11, 2026
Google search engine
- Advertisment -spot_img

విద్యార్థులతో ముచ్చటించిన తీన్మార్ మల్లన్న

📰 Generate e-Paper Clip

మియాపూర్, నవంబర్ 11 (జనముద్ర): బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం మోటకొండూరు మండలంలో పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా స్థానిక జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వారి చదువులు, పాఠశాలలోని వసతులు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ప్రోత్సహించారు.

పాదయాత్రలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న మల్లన్నకు పలువురు పెద్దమ్మలు ఆప్యాయంగా పలకరించారు. తమ కుటుంబ పరిస్థితులు, గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి యోగక్షేమాలను మల్లన్న అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఓ దివ్యాంగుడు తన సమస్యలను వివరించగా, ఆయన ఇబ్బందులను సావధానంగా విని పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే బీసీ రాజ్యాధికార యాత్ర ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!