కాంగ్రెస్‌లో చేరిన 50 మంది మాజీ సైనికులు
మల్కాజిగిరి, (జనముద్ర)8: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఆనుటెక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50 మంది మాజీ సైనికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ సైనికులు పార్టీలో చేరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో ఆనుటెక్ చౌరస్తా సందడిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు, మాజీ సైనికుల చేరికతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.


Recent Comments