మల్కాజిగిరిలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా..

కాంగ్రెస్‌లో చేరిన 50 మంది మాజీ సైనికులు మల్కాజిగిరి, (జనముద్ర)8: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మల్కాజిగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో ఆనుటెక్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50 మంది మాజీ సైనికులు కాంగ్రెస్ పార్టీలో చేరారు....