ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
•మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి
శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు
జవహర్‌నగర్,జనముద్ర: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జవహర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలకు టీపీసీసీ రాష్ట్ర వైస్ చైర్మన్, ఎస్సీ డిపార్ట్మెంట్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గడ్డం శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓబీసీ విభాగం చైర్మన్ పసుపులేటి వీరభాస్కరరావు, ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ మొగిలిపాక వెంకటేష్, బల్లి శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కృష్ణ గౌడ్, మొగిలిపాక రమేష్ తదితరులు హాజరయ్యారు.
అలాగే మహిళా నాయకురాలు అనంతలక్ష్మితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో వేడుకలు సందడిగా సాగాయి.


Recent Comments