EPAPER
Monday, November 9, 2026
Google search engine
- Advertisment -spot_img

దీపావళి వెలుగుల్లో జనముద్ర కొత్త ప్రయాణం.. నూతన వెబ్‌సైట్ ప్రారంభం!

📰 Generate e-Paper Clip

 

ప్రజాస్వామ్యానికి అక్షర రూపం.. ప్రజా గొంతుకకు డిజిటల్ వేదికగా జనముద్ర మరో ముందడుగు!

చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పర్వదినం రోజున జనముద్ర తెలంగాణలో మరో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, పాఠకులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో జనముద్ర నూతన వెబ్‌సైట్‌ దీపావళి పర్వదినమైన ఆదివారం నుంచి అందుబాటులో కి వస్తుందనడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం.

మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా డిజిటల్ జర్నలిజంలోనూ తనదైన ముద్ర వేయాలనే సంకల్పంతో ఈ కొత్త వేదికను అందుబాటులోకి తీసుకోస్తున్నాం. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని ప్రజలకు వేగంగా, స్పష్టంగా, విశ్వసనీయంగా అందించడమే జనముద్ర ప్రధాన లక్ష్యం.

రాజకీయాలు, సామాజిక అంశాలు, ప్రజా సమస్యలు, విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారం, వినోదం తదితర రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, విశ్లేషణలు ఇకపై జనముద్ర వెబ్‌సైట్ ద్వారా పాఠకులకు అందుబాటులో ఉండనున్నాయి.

వాస్తవాలకు ప్రాధాన్యం.. ప్రజల పక్షాన నిలబడటమే లక్ష్యం!

వార్తల వేగం మాత్రమే కాదు.. వార్తల్లో వాస్తవం, విశ్లేషణలో విశ్వసనీయత, ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన గొంతుకగా నిలవడం జనముద్ర లక్ష్యం. నూతన వెబ్‌సైట్ ద్వారా మరింత విస్తృతమైన పాఠకలోకానికి చేరువ కావాలని సంస్థ ఆశిస్తోంది.

దీపావళి వెలుగుల సాక్షిగా ప్రారంభమవుతున్న ఈ కొత్త డిజిటల్ ప్రయాణానికి పాఠకులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రజలు, శ్రేయోభిలాషుల ఆదరాభిమానాలు, సహకారం కోరుకుంటోంది.

జనముద్ర.. మారుతున్న కాలానికి అనుగుణంగా మరో ముందడుగు. ప్రజల కోసం.. ప్రజల గొంతుకగా!

ఈ దీపావళి నుంచి మీ వార్తల ప్రపంచంలో జనముద్ర సరికొత్త చిరునామా.
– జనముద్ర యాజమాన్యం

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!