దీపావళి వెలుగుల్లో జనముద్ర కొత్త ప్రయాణం.. నూతన వెబ్‌సైట్ ప్రారంభం!

  ప్రజాస్వామ్యానికి అక్షర రూపం.. ప్రజా గొంతుకకు డిజిటల్ వేదికగా జనముద్ర మరో ముందడుగు! చెడుపై మంచి సాధించిన విజయానికి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పర్వదినం రోజున జనముద్ర తెలంగాణలో మరో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, పాఠకులకు మరింత చేరువయ్యే లక్ష్యంతో జనముద్ర నూతన వెబ్‌సైట్‌ దీపావళి పర్వదినమైన ఆదివారం నుంచి అందుబాటులో కి వస్తుందనడానికి మేం ఎంతో సంతోషిస్తున్నాం. మారుతున్న మీడియా రంగానికి అనుగుణంగా డిజిటల్ జర్నలిజంలోనూ తనదైన ముద్ర వేయాలనే...