EPAPER
Tuesday, November 10, 2026
Google search engine
- Advertisment -spot_img

అర్ధరాత్రి టపాసుల మోతపై రేణూ దేశాయ్ ఆగ్రహం!

📰 Generate e-Paper Clip

ఇతరుల ఇబ్బందులను గుర్తించరా?
వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య బాధితుల పట్ల కనీస సానుభూతి చూపండి

హైదరాబాద్ (జనముద్ర): దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ సమయంలో శబ్ద కాలుష్యంపై మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారని, అందుకే దీపావళి రోజున మౌనంగా ఉన్నానని తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇబ్బందులను గుర్తించాలని కోరారు. ఇతరుల ప్రశాంతతను దెబ్బతీస్తూ తమ ఆనందమే ముఖ్యమని భావించడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. తోటి మనుషుల పట్ల కనీస సానుభూతి చూపాలని హితవు పలికారు.

దీపావళి పండుగను దీపాల వెలుగులతో ఆనందంగా జరుపుకోవాలని, దానిని శబ్దాల పోటీగా మార్చవద్దని సూచించారు. వీలైనంత వరకు రాత్రి 10 గంటల్లోపే టపాసులు కాల్చడం ముగించాలని, ఆ తర్వాత ఇతరులకు ప్రశాంతత కల్పించాలని కోరారు. తమ ఆనందం కోసం ఇతరులను ఇబ్బందులకు గురిచేయడం తగదని రేణూ దేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, ఇతరుల ఆరోగ్యంపై దాని ప్రభావం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!