అర్ధరాత్రి టపాసుల మోతపై రేణూ దేశాయ్ ఆగ్రహం!

ఇతరుల ఇబ్బందులను గుర్తించరా? వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య బాధితుల పట్ల కనీస సానుభూతి చూపండి హైదరాబాద్ (జనముద్ర): దీపావళి వేడుకల పేరుతో అర్ధరాత్రి దాటినా భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై నటి రేణూ దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పండుగ సమయంలో శబ్ద కాలుష్యంపై మాట్లాడితే తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారని, అందుకే దీపావళి రోజున మౌనంగా ఉన్నానని తెలిపారు. అయితే పండుగ ముగిసిన తర్వాత కూడా అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో టపాసులు కాల్చడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు....