EPAPER
Tuesday, November 10, 2026
Google search engine
- Advertisment -spot_img

మేడ్చల్‌లో జ్యువెలరీ షాపులో భారీ చోరీ!

📰 Generate e-Paper Clip

పోలీస్ స్టేషన్ పక్కనే దుండగుల చేతివాటం.. గోడకు కన్నం వేసి ఆభరణాల అపహరణ

గతంలోనూ ఇదే దుకాణంలో చోరీ.. పోలీసులకు యజమాని ఫిర్యాదు

మేడ్చల్ (జనముద్ర)10: మేడ్చల్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న శ్రీ జగదాంబ జ్యువెలరీ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. దుకాణం వెనుక గది గోడకు కన్నం వేసిన దుండగులు లోపలికి చొరబడి విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులను అపహరించారు.

మంగళవారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని కుమారుడు అజయ్ చౌదరి చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే యజమాని శేషమాల్ చౌదరికి సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ సేకరించి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఇదే జ్యువెలరీ దుకాణంలో గతంలోనూ చోరీ జరగడం గమనార్హం. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే మరోసారి చోరీ జరగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలను గుర్తించి పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!