దున్నపోతుల అలంకరణలు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ
మన్సూరాబాద్, నవంబర్ 9 (ప్రభంజనం): అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తాలో యాదవ సదర్ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. పోచబోయిన గణేష్ యాదవ్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు నగరంలోని యాదవులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి దున్నపోతులను అందంగా అలంకరించి ఊరేగింపుగా మన్సూరాబాద్ చౌరస్తాకు తీసుకొచ్చారు. దున్నపోతులతో నిర్వహించిన విన్యాసాలు, పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందంగా అలంకరించి అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించిన దున్నపోతుల విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కి గౌడ్, యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, కొప్పు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు పోచబోయిన సురేష్ యాదవ్ తదితరులు హాజరై దున్నపోతుల విన్యాసాలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో బొల్లు యాదయ్య యాదవ్, మల్లెపాక శ్రీనివాస్ యాదవ్, కేశబోయిన రవి యాదవ్, పి. శ్రీకాంత్ యాదవ్, పి. రాఘవేందర్ యాదవ్, కరాడి చిట్టి యాదవ్, పి. మహేందర్ యాదవ్, కరాడి జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments