EPAPER
Monday, November 9, 2026
Google search engine
- Advertisment -spot_img

రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఇద్దరు విద్యార్థినుల ఎంపిక

📰 Generate e-Paper Clip

సిద్దిపేట కమాన్, నవంబర్ 9 (జనముద్ర): రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు భూసరి హన్విక, మండల శ్రీరాధిక ఎంపికైనట్లు కోచ్ ఎస్. సంపత్కుమార్ తెలిపారు. మెరీడియన్ పాఠశాలకు చెందిన హన్విక అండర్‌-8 విభాగంలో, శ్రీ సాయి స్కేటింగ్ విద్యార్థిని శ్రీరాధిక అండర్‌-10 విభాగంలో స్పీడ్ స్క్వాడ్ కేటగిరీలో ఎంపికైనట్లు వెల్లడించారు.

ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో వీరిద్దరూ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పిండి అరవింద్, స్పోర్ట్స్ కన్వీనర్ పాల సాయిరామ్, డీవైఎస్వో వీరారెడ్డి రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!