రామాయంపేట, జనముద్ర : విద్యార్థినులు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి, వాటిని నలుగురితో పంచుకున్నప్పుడే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు కెరీర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించి, భవిష్యత్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థినులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే పట్టుదలతో కష్టపడాలని సూచించారు. తమ ఆలోచనలు, భావాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతూ తమలోని ప్రతిభను, నైపుణ్యాలను వెలికితీయాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.