EPAPER
Tuesday, November 10, 2026
Google search engine
- Advertisment -spot_img

తాళం వేసిన ఇంట్లో చోరీ – గుర్తుతెలియని దొంగలపై కేసు నమోదు

📰 Generate e-Paper Clip

తూప్రాన్ (జనముద్ర): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు, బీరువాను పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.

తూప్రాన్ పట్టణానికి చెందిన సంతోష్ రెడ్డి ఆదివారం ఉదయం తన ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతానికి వెళ్లారు. ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి చేరుకుని చూడగా, ఇంటి ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు.

వెంటనే ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువాను సైతం పగలగొట్టి అందులో భద్రపరిచిన సుమారు ఐదు తులాల వెండి చైన్, పావు తులం బంగారు ఆభరణంతో పాటు కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు గుర్తించారు.

ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తూప్రాన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి దొంగల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల సూచనలు.. అప్రమత్తంగా ఉండండి!

ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తే నమ్మకమైన వ్యక్తులకు సమాచారం అందించాలని, పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతున్నారు.

 

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!