ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

పంటల మార్పిడితో పాటు పశుపోషణపై రైతులు దృష్టి సారించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్, నవంబర్ 9 (జనముద్ర): ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని, నీటి లభ్యతను బట్టి పంటలు సాగు చేయాలని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. వ్యవసాయంతో పాటు పశుపోషణను అభివృద్ధి చేసుకోవడం ద్వారా రైతులు అదనపు ఆదాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మెదక్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు సింగూరు జలాలను...